శ్రీశ్రీశ్రీ వీర గంగమ్మ తల్లి దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు

సాక్షి డిజిటల్ న్యూస్ ఒంటిమిట్ట మార్చి 14 వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి ( పాటూరు శ్రీనివాసులు రెడ్డి) మండలంలోని మలకాటి పల్లి సమీపాన వెలసిన శ్రీశ్రీశ్రీ వీర గంగమ్మ తల్లి దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు దశమ వార్షికోత్సవం భాగంగా మొదటి రోజు శుక్రవారం గణపతి పూజ, స్వస్తి వాచకము, అమ్మవారి కలశ స్థాపనము, నవగ్రహ మండప ఆరాధనము, అమ్మవారికి పంచామృత అభిషేకము, ప్రత్యేక అలంకరణ తదుపరి శ్రీ లక్ష్మీ గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ, వాస్తు హోమము, శ్రీ లక్ష్మీ నారాయణ హోమము, అమ్మవారి ప్రీతికరంగా శ్రీ చండీ హోమము, పూజ, మహా నివేదనము, దశవిధ హారతులు, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణము ఘనంగా నిర్వహించారు అనంతరం రాత్రి 9 గంటలకు మాధవ ఈవెంట్స్ నెల్లూరు వారిచే యూత్ సహకారంతో ఘనంగా ఆర్కెస్ట్రా నిర్వహించారు.