శివప్ప నగర్ కాలనీలో నీటి సరఫరా పునరుద్ధరణ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ : కౌతాళం మండల కేంద్రంలోని శివప్ప నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా ఉన్న నీటి సరఫరా సమస్యను అధికారులు పరిష్కరించారు. గౌరవ ఎమ్మెల్యే వై. బాల నాగిరెడ్డి సహకారంతో సర్పంచ్ పాల్ దినకర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
ఎంపీడీవో పి. గోపాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లయ్య, పంచాయతీ కార్యదర్శి జి. యోగేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో పంచాయతీ నీటి సరఫరా సిబ్బంది మూడు డి.ఏ వాల్వులను ఏర్పాటు చేసి పైప్‌లైన్‌లను మరమ్మతులు చేశారు. దీంతో కాలనీ వాసులకు తిరిగి నీటి సరఫరా అందుబాటులోకి వచ్చినట్లు సర్పంచ్ పాల్ దినకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *