శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు, 13 మార్చి 2026 భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలో కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం సభ్యులు, సాహిత్య ప్రేమికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.కార్యక్రమంలో కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి మొల్ల చేసిన సేవలను వక్తలు స్మరించుకున్నారు. ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు భాషకు ఎంతో గొప్ప సంపద అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శాలివాహన సంఘం సభ్యుడు గొల్లపల్లి సురేష్ మాట్లాడుతూ, మొల్ల సరళమైన భాషలో రామాయణాన్ని రచించి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేసిన గొప్ప కవయిత్రి అని అన్నారు. ఆమె ఆదర్శాలను యువత అనుసరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సురేష్, పోతుగంటి ప్రశాంత్, గొల్లపల్లి సుఖేష్, గొల్లపల్లి రాములు, గొల్లపల్లి సాగర్, గొల్లపల్లి సాయి, సుబ్బు మరియు శాలివాహన సంఘం సభ్యులు మరియు స్థానికులు పాల్గొని కవయిత్రి మొల్లకు ఘన నివాళులు అర్పించారు.