వెలిగల్లు ప్రాజెక్టు నుండి రైతులకు కాల్వలు ద్వారా సాగునీరు ఇవ్వాలి

★సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్

సాక్షి డిజిటల్ న్యూస్ :14 మార్చి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా గాలివీడు వెలిగల్లు ప్రాజెక్టు నుండి రైతులకు సాగునీరు ఇవ్వాలని సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ కోరారు శుక్రవారం గాలివీడు మండలం ఎగువ గొట్టి వీడు గ్రామంలో సాగునీటి పై కర్రపత్రాలు. పంపిణీ చేశారు. ఈ సందర్భంగా. సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాధ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరం గొర్లమదీడు దిగువగొట్టి వీడు ఎగువగొట్టివీడు గోరన్ చెరువు గ్రామాల్లో ఉన్న ప్రతి గుంటకు ప్రతి చెరువుకు వెలిగల్లు ప్రాజెక్టు నుండి కాల్వలు ద్వారా సాగునీటిని నింపి గ్రామాలల్లో ఉన్న ప్రతి రైతును ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ప్రతి రైతు కూడా వెయ్యి నుంచి 13 వందల అడుగుల లోతు వరకు బోరు బావులు వేసినా కూడా నీరు పడడం లేదని ఆయన అన్నారు ప్రతి రైతు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోరు బావులు వేసుకున్న నీరు పడక అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఆత్మహత్యల కు గురవుతున్నారని ఆయన తెలియ జేశారు ఈ ప్రాంత గ్రామాల్లో ఉన్న ప్రతి బాగుపడాలంటే ప్రతి రైతు సంతోషంగా ఉండాలంటే సాగునీరు మాత్రమే మార్గం అన్నారు అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఈ ప్రాంత రైతుల పరిస్థితి ఉందన్నారు పక్కనే ఉన్న వెలుగుల ప్రాజెక్టు నుండి రైతులకు సాగునీరు అందియక పోవడం చాలా బాధాకరం అన్నారు కాబట్టి ఈ ఐదు గ్రామాల్లో ఉన్న ప్రతి చెరువు కు ప్రతికుంటకు వెలిగల్లు ప్రాజెక్టు నుండి కాల్వవల ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యంగా మాధవరం గొర్లమదీడు దిగువ గొట్టి వీడు ఎకవగొట్టి వీడు గోరన్ చెర్వు గ్రామాల రైతులు అందరు సాగునీరు వచ్చే వరకు. పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సీపీఐ(ఎంఎల్ )లిబరేషన్ పార్టీ చేపట్టిన సాగునీరు కోసం పోరాటానికి స్వచ్ఛందంగా కదిలి రావాలని ఆయా గ్రామాల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు రేపటి నుంచి ఈ ఐదు గ్రామాలలో సిపిఐ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పల్లెలో ప్రతి ఇంటిని కలుస్తాం అని ఆయన అన్నారు రాజకీయాలకతీతంగా పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా సాగునీరు కోసం ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి ముందుకు రావాలని పేరుపేరునా ఆయన రైతులను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు ఎం పెద్దన్న మాధవరం గ్రామ కార్యదర్శి మల్లికార్జున నాయుడు ‌ నీలావతి ‌రాగవ తదితరులు పాల్గొన్నారు.