విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 14 మార్చ్ 2026 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో యం పి పి ఎస్ పాఠశాలో మరియు అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు సర్పంచ్ డీఈవో ఎంఈఓలు గా పాత్రలు పోషించి గ్రామ ప్రజలను ఆకట్టు కున్నారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ రామ్ నరసయ్య మాట్లాడుతూ.విద్యార్థులు మంచిగా చదువుకొని పట్టుదలతో పరీక్షలు రాసి అధిక మార్కులు సంపాదించాలని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నేను ఆశిస్తున్నాను అని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్ పాల్, అంగన్వాడీ టీచర్లు జీ వాణి, జే నిర్మల, ఆయాలు మంజుల, సుశీల, రేణుక, అటెండర్ చంద్రయ్య, మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.