పయనించే సూర్యుడు. మార్చి 14నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ తెల్కపల్లి మండలం బొప్పల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో స్వయంపరిపాలన దినోత్సవం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా అవతారమెత్తి. తన ప్రతిభను చాటారు. నిత్యం పాఠాలు వినే విద్యార్థులే నేడు విద్యాధికారిగా, ఉపాధ్యాయులుగా భాద్యతలు స్వీకరించి పాఠశాలను నడిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కరాచారి, ఉపాధ్యాయులు అరాఫత్ , బాలకృష్ణ, సైదులు మరియు ఏ ఏ పి సి చైర్మన్ ఎల్లమ్మ, గ్రామ సర్పంచ్, నవ్య మల్ల చారి, ఉప సర్పంచ్ రాజు, గ్రామ యువకులు మల్లేష్ నేరడి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.