విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

★సిద్ధార్థ మోడల్ స్కూల్లో ఘనంగా స్వయం పరిపాల దినోత్సవం.

పయనించే సూర్యుడు. మార్చి 14.నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ నాగర్ కర్నూల్ జిల్లా.తెలకపల్లి మండల కేంద్రంలోని సిద్ధార్థ మోడల్ స్కూల్లో శుక్రవారం విద్యార్థుల ఉపాధ్యాయులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో విద్యార్థులు చేసిన నృత్యాల ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గా అభిలాష్, హెడ్మినిస్ట్రేటివ్ గా స్నేహ శ్రీ, కరస్పండెంట్ గా సాత్విక్, కలెక్టర్గా లావిన్, ఆర్ జెడిగా అద్విత్ మంజిత్, డీఈఓ గా దీక్షిత్, డిప్యూటీ డి ఈ ఓ గా సాకేత్, వ్యవహరించగా మరో 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా తమ విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు ఎం శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ శివప్రసాద్, పాఠశాల కరస్పాండెంట్ ఎం విజయ గౌడ్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.