విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ

*పంపిణీ చేస్తున్న చెస్ నెట్వర్క్ సంస్థ కిరణ్ కుమార్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 14 బోధన్ :చెస్ నెట్ వర్క్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోటగిరి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మండల పరిధిలోని ప్రతి పాఠశాలకు, కేజీబీవీలకు ,రెసిడెన్షియల్ స్కూల్ లకు టీచర్ల ద్వారా ప్రధానోపాధ్యాయుల ద్వారా చెస్ బోర్డులను పంపిణీ చేశారు.ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక బోర్డు చొప్పున మండలం లో 120 బోర్డులను అందించడం జరిగిందని,చెస్ నెట్ వర్క్ సంస్థ ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై వారి ప్రసంగిస్తూ సుధీర్ కొరాటీ కెనడా స్థాపించిన చెస్ నెట్ వర్క్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చెస్ ఆట ఆడేందుకు ప్రోత్సహించాల ని ముఖ్యంగా పేద విద్యార్థులకు చెస్ ఆట అలవర్చితే వారి మేధస్సు వికాసానికి బాటలు వేసినట్లేనని భావించి, ప్రతి ప్రభుత్వ పాఠశాలకు చెస్ బోర్డులను అందిస్తున్నామని వారు పేర్కొన్నారు .విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే చెస్ ఆటను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని వారు కోరారు చెస్ ఆట వలన విద్యార్థులకు ఏకాగ్రత, సృజనాత్మకత పెంపొందడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు గౌతమ్ కుమార్ ఎమ్మార్పీఎస్ సిబ్బంది రాజేష్ మోహన్ సుధాకర్ జైవీర్ హనుమంతు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సాయిలు గంగరాజు ఉదయ్ చందర్ కృష్ణమోహన్ పాషా సంతోష్ బస్వంత్ అతిక్ శరత్ కుమార్ రూప సుమలత భూలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *