సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14, 2026,( రిపోర్టర్ ఇమామ్), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామ సంత బజార్ వేలంపాటను ఈ వారం రోజుల్లోపు నిర్వహిస్తున్నట్లు కొండాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి కే. సురేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కొండాపురం సంత బజారు రూ, 60, 3500 లు పాట పాడడం జరిగిందని ఆయన వివరించారు. కొండాపురం సంత బజార్ వేలంపాటలో పాల్గొనేవారు ఇంటి టాక్స్ ని చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు ఇట్టి అవకాశాన్ని కొండాపురం గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు.