వచ్చే సీజన్ నాటికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం..ఎమ్మెల్యే అమిలినేని

★రైతులు, వ్యాపారస్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే ★అన్ని వసతులతో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చెసి చూపిస్తా

సాక్షి డిజిటల్ న్యూస్ 14/2026, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్సీ ఇంచార్జి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు అత్యధిక శాతం చింతపండును సప్లై చేసే కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో మరిన్ని వసతులు కల్పిస్తామని, అలాగే వచ్చే చింతపండు సీజన్ నాటికి మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి రైతులకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు భరోసా ఇచ్చారు..నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న చింతపండు క్రయ, విక్రయాలు జరిగే విధానం, కూరగాయల మార్కెట్ ను మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ళ లక్ష్మీదేవి రమేష్, స్థానిక నాయకులు, వ్యాపారలతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పరిశీలించారు..చింతపండు రైతులతో మాట్లాడుతూ ధరలు ఎలా ఉన్నాయి, గిట్టుబాటు అవుతుందా లేదా, కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు ఎలా ఉన్నాయి అంటూ అడిగి తెలుసుకున్నారు.అలాగే ప్రతి దుకాణం సందర్శించి ఎంత చింతపండు వస్తోంది, క్వాలిటీ ఎలా ఉంది అని వారిని అడగ్గా మూడు నెలలు మంచి ధరలు రావాలంటే చింతపండు రంగు మారకుండా ఉంచేందుకు కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఇటు రైతులకు, వ్యాపారస్థులకు గిట్టుబాటు అవుతుందని చెప్పగా తప్పకుండా ఇప్పటికే ఫైల్ ప్రభుత్వం వద్ద ఉందని, అంతకు మునుపే వచ్చే సీజన్ కు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానని తెలిపారు..అనంతరం కూరగాయల మార్కెట్ సందర్శించి కూరగాయల వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు..తప్పకుండా అందరికి సౌకర్యంగా, అన్ని సదుపాయలతో కూడిన మార్కెట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు..