లింగాపూర్ లో చెలరేగుతున్న రాజకీయ రగడ !!

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 శంకరపట్నం కరీంనగర్ జిల్లా రాజు బూర్ల సీనియర్ జర్నలిస్ట్ .!! కేశవ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగపూర్ గ్రామంలో రోజురోజుకు రాజకీయ రగడ చిల్లరేగుతున్నట్లు స్థానికులు తెలిపారు. రాజకీయ ముసుగులో ముగ్గురు యువకులు వ్యవహారంపై ఈ రగడ కొనసాగుతుంద న్నారు భూమి వివాదాలు సృష్టించి రాజకీయ ముసుగులో పెద్ద ఎత్తున పంచాయతీలు నిర్వహించి అందిన కాడికి వసూలు చేస్తున్నట్లు కూడా ఉన్నాయన్నారు ఈ విషయంలో రోజురోజుకు అడ్డు అదుపు లేకపోవడంతో రెచ్చిపోతూ రగడకు కీలకపాత్ర పోషిస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు. అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని ముగ్గురు వ్యక్తులు గ్రామంలో రంగులు మారుస్తూ రగడకు ఊతం పోస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు ఈ విషయంలో పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *