రోడ్డు ప్రమాదంలో ఇద్దరి గాయాలు ఒకరి పరిస్థితి విషమం

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 శంకరపట్నం కరీంనగర్ జిల్లా రాజు బూర్ల సీనియర్ జర్నలిస్టు !! కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రం గా గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మెట్పల్లి గ్రామానికి చెందిన అంతర్పుల నరేష్. వంగల సంపత్ రెడ్డిలు కలిసి బైకుపై మొలంగూర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధువుల శుభ కార్యక్రమం వెళ్లి తిరిగి బైకుపై.వస్తుండగా హుజురాబాద్ నుండి కరీంనగర్ వెళుతున్న లారీ ఎదురుగా వచ్చి బైకును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు . దీంతో ఇద్దరు యువకులు బైక్ పై రోడ్డుపై పడ్డారు దీంతో నరేష్ తలకు బలమైన గాయమై తల పగిలింది . దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మరో యువకుడైన వంగల సంపత్ రెడ్డి కాలు విరిగి రోడ్డుమీద పడడంతో స్థానికులు గమనించి 108 ఫోన్ కు సమాచారం అందించారు దీంతో ఈఎంటి గూడూరు సతీష్ రెడ్డి పైలట్ గోపి సంఘటన స్థలానికి హుటాహుటిన వెళ్లి అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ ప్రభుత్వా సుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు చెప్పారు బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు సంఘటన స్థలంలో జరిగిన వివరాలను ప్రత్యక్ష సాక్షులను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *