రైలు ప్రయాణం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

*తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్

సాక్షి డిజిటల్ న్యూస్ :14 మార్చి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ( రాము), ములకల చెరువు రైల్వే స్టేషన్‌లో 07605/07606 తిరుపతి-అకోలా-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగుతుందని అధికారికంగా గత వారం సౌత్ సెంట్రల్ రైల్వే – ఎస్ సి ఆర్ అధికారులు ప్రకటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు రైల్వే స్టేషన్‌ వద్ద శుక్రవారం ఎన్ డి ఏ కూటమి కుటుంబ సభ్యులు ఎంతో అట్టహాసంగా పండుగలా ఈ ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ పాల్గొన్నారు.. ఈ సౌకర్యాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం మరియు మన ప్రాంత అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. మా అభ్యర్థనను అంగీకరించినందుకు రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కి మరియు సమస్యపై కృషి చేసిన రాజమండ్రి ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి కి మా ధన్యవాదాలు తెలపడం జరిగినది. ఈ సందర్భంగా, లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ మరియు గార్డ్ కు శాలువా తో సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు , బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ , రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి, పౌర సరఫరాల రాష్ట్ర డైరెక్టర్ పర్వీన్ తాజ్, కట్ట దొరస్వామి నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు చర్లపల్లి నరసింహారెడ్డి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *