సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ : మిద్దె మల్లేష్ యాదవ్ 14/03/26, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడేది ఈ తేదీల్లోనే రైతు భరోసా పథకం పై కీలక అప్డేట్ ఈ నెలాఖరులో రైతుల ఖాతాలోకి నిధులు రెండు విడతల్లో నిధులు పంపిణీ కీ ప్రభుత్వం ఏర్పాట్లు రైతులకు పంటల సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రెండు విడతల్లో ఎకరాకు రూపాయలు 6000 చొప్పున నిధులు విడుదల చేస్తూ విషయం తెలిసిందే అయితే రబ్బి సీజన్కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆలస్యం అవుతూ వస్తుంది దీంతో రైతు భరోసానిధుల కోసం గత కొన్ని నెలలుగా తెలంగాణ అన్నదాతలు ఎదురుచూస్తున్నారు అయితే ప్రభుత్వం తాజాగా రైతు భరోసానిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు మొత్తం రూపాయలు తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులను అహర్తులైన రైతులకు అకౌంట్లో జమ చేయనున్నట్లు తెలిపారు అయితే ఈ నిధులను రెండు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు ఈ నెలాఖరులోగా రూపాయలు 4500 కోట్లు రైతుల నిధులను వచ్చే నెలలో మిగిలిన రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు ప్రతిసారి రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల ఖాతాల్లో దశలవారీగా ప్రభుత్వం జమ చేస్తుంది తొలుత ఎకరం నుంచి రెండు ఎకరాలు కలిగిన రైతులకు ఆ తరువాత నాలుగు ఎకరాల లోపు ఆ తర్వాత ఐదు ఎకరాల వరకు కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేస్తుంది ఈసారి రబ్బికి సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల చివరి వారంలో మూడు ఎకరాలు లోపు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది నాలుగు ఐదు ఎకరాల్లోపు రైతులకు ఏప్రిల్ నెల మొదటి వారం లేదా రెండో వారంలో జమ చేస్తారని ప్రభుత్వం వర్గాల్లో చేర్చ జరుగుతుంది.