పయనించే సూర్యుడు మార్చి 14 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్: ఈరోజు రావుల చెరువు తండాలో మూడవత్ కృష్ణ నాయక్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించ బడింది. ఈ కార్యక్రమానికి గ్రామంలోని మాజీ మరియు ప్రస్తుత సర్పంచులు, స్థానిక నాయకులు, ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ మూడవత్ గోవింద్ నాయక్ చందూలాల్ కృష్ణ మునిందర్ సర్పంచ్ పుల్య కృష్ణ నాయక్ గోపాల్ హనుమంత్ రవి సోమ్లా వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను అభినందించారు.