రక్షణతో కూడిన ఉత్పత్తి యాజమాన్యం ముఖ్య లక్ష్యం

★సేఫ్టీ జి ఎం సాయిబాబా

అక్షర ఆయుధం, మందమర్రి టౌన్ మార్చి 13, మందమరి ఏరియాలోని ని కేకే పై శుక్రవారం కార్పొరేట్ జి ఎం సేఫ్టీ సాయిబాబా సందర్శించారు. ఈ సందర్భంగా గ నికి సంబంధించిన ఉత్పత్తి లక్ష్యాలు రక్షణ వివరాలను గని మేనేజర్ శంభూనాథ్ పాండేను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిఎం సేఫ్టీ మాట్లాడుతూ రక్షణ తో కూడిన ఉత్పత్తి యాజమాన్యం లక్ష్యమని చెప్పారు ప్రమాదాలు లేని సింగరేణి ధ్యేయంగా ఉద్యోగులు అధికారులు కలిసికట్టుగా అంకితభావంతో పనిచేయాలన్నారు. యాజమాన్యం రక్షణకే పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. పనిలో ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ప్రమాదాలు జరగవున్నారు. కేకే ఐదు గానికి రక్షణలో ఉత్పత్తిలో మంచి రికార్డులు కలిగి ఉండాలి తెలిపారు. ప్రతిరోజు రక్షణ సూత్రాలు పాటిస్తూ పని చేయడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు సంభవించ వని తెలిపారు. ప్రమాదాల నివారణకు అత్యంత సాంకేతికత పరిజ్ఞానంతో కూడిన రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉందని దీనిని సాధించడంతో పాటు అదన ఉత్పత్తి సాధించి రికార్డులు నెలకొల్పాలన్నారు. అనంతరం ఆయన గనిలో దిగారు. పని స్థలాలు పర్యవేక్షించారు. ఉద్యోగులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జి ఎం సేఫ్టీ రఘుకుమార్ మందమరి ఏరియా రక్షణ అధికారి భూ శంకరయ్య కేకే వన్ గ్రూప్ ఏజెంట్ రాంబాబు పాల్గొన్నారు.