సాక్షి డిజిటల్ న్యూస్- మార్చ్ 14- సికింద్రాబాద్ - డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశం రాజు ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాస సందర్భంగా న్యూ బోయగూడా లోని ఈ క్యూబా మజీద్ లో మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ ఘనంగా జరిగింది . రంజాన్ మాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులందరికీ పండ్లను పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ సావిత్రి మహేష్, లంక రాజు , ఎస్సీ సెల్ అధ్యక్షుడు గజ్జల శీను, యూత్ వింగ్ అధ్యక్షుడు కొత్తూరు వెంకటేష్ , మైనార్టీ అధ్యక్షుడు జావిద్, ప్రేమ్, శివకుమార్ , వినయ్ , నాగభూషణం , అబ్బాస్ బాయ్, కరీం బాయ్ , అయూబ్ బాయ్, సల్మాన్ , రషీద్ , షరీఫ్ , ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.