సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి14 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న ) తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోపాలు పంపిణీ చేశారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై ముస్లిం కుటుంబాలకు తోపాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ త్యాగం, సేవా భావం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర ప్రేమాభిమానాలతో పండుగలను జరుపుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మసీదు కమిటీలకు మండల ఎంపీడీవో సిలార్ సాహెబ్ రంజాన్ తోపాలను అందజేశారు. పేద మరియు అవసరమైన కుటుంబాలకు ఈ తోపాలు అందడం ఆనందంగా ఉందని తెలిపారు. రంజాన్ పండుగను శాంతి, మంచి వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, ముస్లిం సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.