సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కనికరపు పావని(23) 12.03.2026 గురువారం రాత్రి సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి బయటకి వెళ్ళి మరల ఇంటికి తిరిగి రాలేదని, చుట్టు పక్కల ఇళ్లలో తెలిసిన బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదని పావని తండ్రి శ్రీనివాస్ శుక్రవారం కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల ఎస్ఐ సందీప్ తెలిపారు. పావని ఇంటి నుండి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు పంజాబీ డ్రెస్,ఎత్తు 5' 7, చామనఛాయ రంగులో ఉంటుందని తన ఆచూకీ తెలిసిన వారు 8712656831 మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని ఎస్ఐ తెలిపారు.