యడ్లపాడు గ్రామంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి విడదల రజిని …

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 యడ్లపాడు మండల ప్రతినిధి యడ్లపాడు గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చిన్న నాగేశ్వరరావు కుమారుడు అశోక్ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరుల నివాసానికి వెళ్లి మాజీ మంత్రి విడదల రజిని ఆశీర్వదించారు…ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, యడ్లపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మాథ్యూ సాగర్, నాయకులు రాచమంటి చింతరావు, కర్నాటి సుబ్బారావు, బుల్లెబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు