పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 యడ్లపాడు మండల ప్రతినిధి.. యడ్లపాడు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు…ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రజల హృదయాల్లో నిలిచిందని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు ఆమె అభినందనలు తెలిపారు….ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, యడ్లపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మాథ్యూ సాగర్, యడ్లపాడు గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షుడు నాగ మల్లేశ్వరరావు, నాయకులు రాచమంటి చింతరావు, కర్నాటి సుబ్బారావు, బుల్లెబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు…