మైనార్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం చట్టరీత్యా నేరం.

★గార్ల ఎస్ఐ బి సాయికుమార్.

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) మైనర్లకు పొగాకు ఉత్పత్తులను సిగరెట్ తంబాకు గుట్కా పాన్ మసాలా లు అమ్మడం చట్టరీత్యా నేరమని గార్ల ఎస్ ఐ బి సాయికుమార్ అన్నారు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల కు 100 మీటర్లకు సమీపంలో ఉన్న పాన్ షాపులను గార్ల ఎస్ఐ బి సాయికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పాన్ షాప్ యజమానులను ఉద్దేశించి మాట్లాడుతూ మైనర్లకు పొగాకు ఉత్పత్తులను సిగరెట్ తంబాకు గుట్కా పాన్ మసాలా లు వంటి మత్తు పదార్థాలు అమ్మడం చట్టరీత్యా నేరమని షాప్ యజమానులు తమ షాప్ వద్దకు మైనర్లు లో వస్తే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొగాకు ఉత్పత్తులను అమ్మవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ లు సిరాజ్ భాష, సైదులు తదితరులు పాల్గొన్నారు.