సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి.14, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం యన్, డి,ఏ కూటమి ప్రభుత్వం తిరుపతి-అకోలా వీక్లీ ఎక్స్ ప్రెస్కు ములకలచెరువు రైల్వే స్టేషన్లో స్టాపింగ్ సౌకర్యం కల్పించిందని కూటమి నేతలు అన్నారు. శుక్రవారం రైల్వే అధికారులతో కలసి తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్, బి,జే, పి జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ్, జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహా రెడ్డి,సివిల్స్ సప్లయ్ డైరెక్టర్ యస్ యం పర్వీన్ తాజ్ తంబళ్లపల్లె నియోజకవర్గ పరిశీలకులు దినేశ్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్,బి,కొత్తకోట మండలం అధ్యక్షులు మేడా ముకుంద బాబు, బిజెపి యువ మోర్చా నాయకులు బండి కార్తీక్ బాబు ,మునిరాజు, పూజలు చేసి ప్రారంబించారు.