పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,మంథని మున్సిపాలిటీలో నూతనముగా ఎన్నికైన పాలక వర్గ సభ్యుల మొదటి సాధారణ సమావేశమునకు మంత్రి వర్యులు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొనడం జరిగినది. మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ N.మనోహర్ నిర్వహించిన సాధారణ సమావేశములో పాలక వర్గ సభ్యులకు మంథని పట్టణ అభివృద్ధి పనుల గురించి దిశ - నిర్దేశ్యము చేశారు. వార్డుల వారిగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వారి సలహాలు సూచనలతో ప్రణాళిక తయారు చేసి వార్డుల యందు సమస్యలను పరిష్కరించుకోవాలని మంథని పట్టణ అభివృద్ధి చేయాలనీ తెలిపారు.ఈ కార్యక్రమములో అవసరమగు ముఖ్య అంశాలు పారిశుధ్య, త్రాగునీటి, వీధి దీపాలు, మొక్కలు పెంపకం, చలివేంద్రాలు ఏర్పాటు మొదలగు వివిధ అంశాల మీద చర్చించి ఆమోదించడం జరిగింది.తదుపరి మెప్మా విభాగములో SHGs మెంబర్స్ స్వయంగా పనికి రాని వస్తువులతో తాయారు చేసిన సృజనాత్మక వస్తువులను పరిశీలించారు.ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలక వర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మాచీడి రాజు గౌడ్, స్రవంతి మద్దికట్ల,పోతరబోయిన శ్రీలత, జంబోజు శ్రీమతి, మారుపాక నిహారిక, వేముల లక్ష్మి, యేల్లంకి వంశీధర్ మున్సిపల్ మహిళా సిబ్బంది, మెప్మా ఆర్.పి లు తదితరులు పాల్గొన్నారు.