మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

★చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై దిలీప్ కుమార్ గురజాల…

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద మార్చ్ 14, హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నందు మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ శుక్రవారం చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎస్సై దిలీప్ కుమార్ గురజాల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై దిలీప్ కుమార్ చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దిలీప్ కుమార్ గురజాల మాట్లాడుతూ వేసవికాలంలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా నిత్యం ప్రయాణికులతో, ప్రజలతో రద్దీగా ఉండే బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని కొనియాడారు. అదేవిధం గా మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరెన్నో ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఎస్సై దిలీప్ కుమార్ గురజాల,టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ అబ్దుల్ సుభాన్,షఫీఉల్లా తదితరులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహబూబ్ బాషా, జమియతే అహలే హదీస్ అధ్యక్షుడు సాదిక్, కోశాధికారి ఉమర్, టిడిపి మండల మైనార్టీ అధ్యక్షుడు మోయిన్, సొసైటీ సభ్యులు శాలి షబ్బీర్, షఫీ, రఫీక్, సుభాన్, చాంద్, షాకీర్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.