మాజీ సింగరేణి కార్మికుడి కుంటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 14, మణుగూరు /భద్రాద్రికొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న : మణుగూరు సింగరేణి కాలరీస్ సంస్థలో పని చేసే బోళ్ల వెంకటేష్ S/O బోళ్ల సత్యనారాయణ. అతను తన తల్లిదండ్రులును ఇంటి నుంచి గెంటి వేశాడని. వారు వేరే దగ్గర అద్దెకు నివాసం ఉంటున్నామని . మాయోగక్షేమాలను,పట్టించుకోవడంలేదని తన కోడలు అయిన మౌనిక కూడా మాటలతో చిత్ర వధకు గురి చేస్తుందని అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,అతని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మణుగూరు మండలం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి ఆదేశాల మేరకు శ్రీమతి గురిజాల వరలక్ష్మి , మరియు తనయుడు గురిజాల సందీప్ చేతులు మీదగా వారికీ నిత్యవసర సరుకులను స్థానిక రేణుక చౌదరి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు ఎండి షబానా, కన్నాపురం వసంత, రెడ్డిబోయిన రేణుక, సౌజన్య డాకూరి, లక్కింశెట్టి హేమలత స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.