సాక్షి డిజిటల్ న్యూస్,వేంపల్లె, మార్చి :14( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) వేంపల్లి మాజీ సర్పంచ్ రాయవరం రామలింగయ్య ను జడ్పిటిసి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల గత కొంత కాలంగా మాజీ సర్పంచ్ రామలింగయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. డాక్టర్ల సలహా మేరకు ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పిటిసి మాచిరెడ్డి రవి కుమార్ రెడ్డి శుక్రవారం మాజీ సర్పంచ్ రామలింగయ్య స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దైర్యంగా ఉండాలని సూచించారు. డాక్టర్ ల సలహాలు, సూచనలు పాటిస్తూ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రామలింగయ్య ను పరామర్శించిన వారిలో ఎంపీటీసీ మణి గోపాల్ రెడ్డి ఉన్నారు.