మహా పాదయాత్ర ను విజయవంతం చేయండి-బీజేపి పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్, 14 మార్చ్ 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ తిరుకోవళ్లూరి సంజయ్ : శనివారం ఉదయం 7-00 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి కొండగట్టు వరకు నిర్వహించే మహా పాదయాత్ర ప్రారంభించడం జరుగు తుందని పెద్దపల్లి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఆశోక్ రావు బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి లు పిలుపు నిచ్చారు. కావున పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీ ల నుండి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ బంధువులు పాల్గొని మహా పాదయాత్ర ను విజయవంతం చేయాలని పెద్దపల్లి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఆశోక్ రావు బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి లు కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు రమేష్, జిల్లా కార్యదర్శి గర్రెపెల్లి నారాయణ స్వామి, కౌన్సిలర్ కందునూరి సమత కుమార్, మాజీ సర్పంచ్ పల్లె ఓదెలు, కొమ్ము తిరుపతి, లంక శంకర్, నాగుల మాల్యాల తిరుపతి, కామని రాజేంద్రప్రసాద్, గజభీంకార్ పవన్, భూసారపు సంపత్, ఎర్రం సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *