మహమ్మదాపురం గ్రామంలో ప్రజా పాలన ప్రణాళిక పనులుప్రారంభం.

*బోడ మంజు రవి (గ్రామ సర్పంచ్)

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) పాలేరు నియోజకవర్గం లోని తిరుమలాయ పాలెం మండలం, మహమ్మదాపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా క్రాస్ రోడ్ లో గ్రామ సర్పంచ్ బొడ మంజు రవి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గోడ మంజు రవి మాట్లాడుతూ పలు ప్రాంతాలలో డ్రైనేజీ రోడ్లు ఖాళీ స్థలాలను శుభ్రం చేయించి పెరిగిన మొక్కలను తొలగిస్తామని. 99 రోజుల కార్యచరణ ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామ పరిశుభ్రత బాధ్యత అందరూ తీసుకోవాలని గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల పిల్లలు పెద్దలు రోగాల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కట్ల మహేష్. కార్యదర్శి ప్రేమ్ నాయక్ వార్డు నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *