సాక్షి డిజిటల్ న్యూస్ 14 మార్చ్ : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి మండల పరిధిలోని వెంకటాపురం శ్రీ మత్స్యగిరిలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం రోజు భక్తులు సమర్పించిన కానుకలు హుండీ లెక్కించగా 148 రోజులు (4 నెలల 24 రోజులు) లకు గాను రూ.15,92,030 /- లు శ్రీ స్వామి వారి కళ్యాణ కట్నాలు రూ.25,828/- మరియు నిత్యాన్నప్రసాదం రూ.13,581 /లు ఆదాయము వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వాహణా ధికారి సల్వాది మోహన్ బాబు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో వెంకటాపురం గ్రామ సర్పంచ్ కర్నేకంటి కళమ్మ యాదయ్య , దేవస్థానం మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి , అర్చకులు, సిబ్బంది, శ్రీ సాయి సేవా సమితి సభ్యులు హైదరాబాద్ , కెనరా బ్యాంకు సిబ్బంది వెంకట్, స్వామి, మరియు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.