భారత్ ఆదివాసి పార్టీకి పూర్తి మద్దతు అంటున్న ఆదివాసి సంక్షేమ పరిషత్.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.14.2026 భారత్ ఆదివాసి పార్టీకి పూర్తి మద్దతు ఆదివాసి సంక్షేమ పరిషత్ రిజిస్ట్రేషన్ నెంబర్ 38 98/90 సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్, పోలవరం జిల్లా, రంపచోడ వరం నియోజకవర్గం భారత్ ఆదివాసి పార్టీ జిల్లా ఇన్చార్జి మద్దేటి అంజి రెడ్డి. పిలుపుమేరకు మారడమిల్లి మండలంలో మాడమల్లి గ్రామంలో ఈ రోజు 13.03.2026 నాడు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత్ ఆదివాసి పార్టీకి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బండారు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యక కార్యదర్శ పూనెం చిన్న వీరభద్రం భారత్ ఆదివాసి పార్టీకి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతిస్తుందని ప్రకటించారు.ఎందుకంటే ఆదివాసి పార్టీ ప్రత్యేకంగా ఆదివాసీల హక్కులు వారి చట్టాలు జీవోల మీద కట్టుబాట్లు సాంప్రదాయాల మీద చట్ట సభల్లో దేశవ్యాప్తంగా వినిపించే ఏకైక పార్టీ భారత్ ఆదివాసి పార్టీని తెలియజేశారు.అందువలన భారత్ ఆదివాసి పార్టీ ఇది ఆదివాసిల జాతీయ పార్టీ అని అందుకే అన్ని ఆదివాసి సంఘాలు కలిసి రావలసిందిగా పిలుపునిచ్చారు. ఆదివాసి అన్నలారా అక్కల్లారా ఇకనైనా మేల్కొని ఆలోచించి మన యొక్క రిజర్వేషన్లు హక్కులు చట్టాలను కాపాడుకోవాలి.ఐదవ షెడ్యూల్ భూ భాగంలో ఆదివాసీలు భూములను కోల్పోతున్నారు. అందువలన ఆదివాసిలందరూ చెయ్యి చెయ్యి కలిపి ఈ భారత్ ఆదివాసి పార్టీని ముందుండి నడిపించాలని. ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బండారు వెంకటేష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం చిన్న వీరభద్రం పిలుపునిచ్చారు.ఇకనుండి భారత్ ఆదివాసి పార్టీకి మా ఆదివాసి సంక్షేమ సంఘం నుంచి పూర్తి మద్దతిస్తామని. ముందుండి .నడిపిస్తామని తెలియ జేసియున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మద్దేటి అంజి రెడ్డి యువజన విభాగ అధ్యక్షులు నెక్కల శ్రీనివాసరావు పాల్గొన్నారు.