బోయిన్ పేట్ సమస్యలు పరిష్కారించాలని మంత్రి శ్రీధర్ బాబు కు

*వినతి పత్రం అందజేసిన 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని మున్సిపల్ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు కు బోయిన్ పేట్ లోని పలు సమస్యల మీద వినతి పత్రం అందజేసిన 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి 1.కల్లు మండువా నుండి బొక్కల వాగు వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో కలసి 20 ఫీట్ల సీసీ రోడ్డు నిర్మాణం. 2.బోయిన్ పేట్ లోని గల్లీలలో మిగిలి ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం 3.బోయిన్ పేట్ కు 3 మంచి నీటి బోర్లు 4.బోయిన్ పేట్ లో నిరుపేదలు ఎక్కువ ఉండడం వల్ల ఇందిరమ్మ ఇల్లు లు అధికంగా మంజూర్ చేయాలి. వీటికి సానుకూలంగా స్పందించిన మంత్రి వర్యులు తప్పకుండా పరిస్కారిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *