‘ఫ్రై డే డ్రై డే’ కార్యక్రమంతో గ్రామ పరిశుభ్రతపై అవగాహన

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ 13 2026 జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి కరుణాకర్ ​రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో 'ఫ్రై డే డ్రై డే' గ్రామ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచడం, దోమల నివారణతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లా సాయగౌడ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అంజిత్ రెడ్డి, పీఎస్ ప్రశాంత్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.