యర్రగొండపాలెం (సాక్షి డిజిటల్స్)ఆర్ సి ఇంచార్జి రాము : యర్రగొండపాలెం మండలంలో విలేఖరులుగా పనిచేస్తున్న వారి కోసం యర్రగొండపాలెం పట్టణంలో ప్రెస్ క్లబ్ నిర్మించుకునేందుకు 10 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ శుక్రవారం యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ద్వారా తహసీల్దార్ డి మంజునాథ రెడ్డికు ప్రెస్ క్లబ్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. యర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ జరుగుగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఎరిక్షన్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రెన్ క్లబ్ లేని కారణంగా విలేఖరులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అసౌకర్యంగా ఉందన్నారు. అందువల్ల ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు.అలాగే విలేఖరులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎరిక్షన్ బాబు అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పఠాన్ రసూల్ ఖాన్,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి చిన్న యేసేబు, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షేక్ బాజీ,కార్యవర్గ గౌరవ అధ్యక్షులు షేక్ మాబువలి,99 టివి,గౌరవ సలహాదారులు మందా ఆదాం, డి-8టివి, ఉపాధ్యక్షులు రామావత్ శంకర్ నాయక్, సాక్షి టివి, డోలు శ్రీకాంత్, హెచ్ఎమ్ టివి, తప్పెట్ల కోటేశ్వరరావు, దిశ, సహాయ కార్యదర్శులు గర్నేపూడి కోటేష్ ఆంధ్రప్రభ, గుంటి రాము, భారత్ టూడే టివి, క్రమశిక్షణ సంఘం సభ్యులు చింతగుంట్ల మల్లికార్జున, ఏబీఎన్,మీడియా ఇన్చార్జిగా అవుల ఏసు బాబు, అఖండ భూమి, కార్యవర్గ సభ్యులు తంగిరాల మధుసూధనరెడ్డి, ఐ న్యూస్, దగ్గుల శివ కృష్ణారెడ్డి, సుమన్ టివి తదితరులు పాల్గొన్నారు.
