సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ చింతకింది సిద్దు మార్చి 14 2026, కొందుర్గ్ మండలం రంగారెడ్డి జిల్లా, ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్బంగా తెలంగాణ డయోగ్నోష్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం షాద్ నగర్ పట్టణంలో స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్ లో నిర్వహించడం జరిగింది. రక్త దానం వల్ల ప్రయోజనాలు ఈ కార్యక్రమానికి హాజరైన పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రక్త దానం అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే ప్రాణం పోయే స్థితిలో ప్రాణాన్ని రక్త దానం ద్వారా కాపాడ బడుతుంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాల ని కంటి పొర చర్మం , గుండె మూత్రపిండం, రక్తం, వగైరాల మరొకరి దానం చేస్తూ ఎందరికో ప్రాణదాయాలుగా నిలుస్తున్నారు నిలుస్తున్నారు కనుక అన్ని దానాలకన్న రక్త దానం చాలా విలువైనది అని ఆయన ఈ సందర్భంగా. నిర్వాహకులను అభినందించారు.. ఈ కార్యక్రమానికి అనురాగ్ రెడ్డి, అరవింద్, యువ సత్తా నాయకులు లక్ష్మణ్, పోతుల శ్రీకాంత్, అనిల్ కుమార్ గౌడ్, శ్రవణ్ కుమార్,చెవుల బాస్కర్, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.