ప్రజా సేవకు నిలువెత్తు నిదర్శనం నేనావత్ లింగ నాయక్

★పదవి ఉన్నా లేకున్నా.. ప్రజల చెంతనే నేనావత్ లింగ నాయక్★అభివృద్ధికి బాటలు.. ఆపదలో అండ: నేరేళ్లపల్లి ముద్దుబిడ్డ★పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న హేమాహేమీలు మహామహులు

పయనించే సూర్యుడు : మార్చి 14 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ: రాజకీయాలను ప్రజా సేవకు మార్గంగా ఎంచుకుని, దశాబ్దాలుగా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు నేనావత్ లింగ నాయక్. నేరేళ్లపల్లి గ్రామ పరిధిలోని గుడిబండ తండాలో జన్మించిన ఆయన, సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. రెండు పర్యాయాలు ఎంపీటీసీగా విజయం సాధించి, బాలానగర్ మండల వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించి నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు.కేవలం పదవులకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతలోనూ ఆయన ముందుంటున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, ఆలయాల నిర్మాణాలకు భారీగా విరాళాలు ఇవ్వడమే కాకుండా.. పేద ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆపద సమయంలో, అనారోగ్యంతో ఉన్న వారికి ఆర్థికంగా అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ఆయనను స్థానికులు "ప్రజల మనిషి"గా కొనియాడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు