ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూర్ లో 11వ వార్డ్ లో ఈ రోజు కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న అద్వర్యం లో .ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న 9th వార్డ్ కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ గౌడ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్నేపు పద్మ పాల్గొన్నారు.99 రోజుల ప్రగతి ప్రణాళిక లో భాగంగా,11 వ వార్డు కౌన్సిలర్ పోతుల వెంకన్న గౌడ్ మాట్లాడుతూ వార్డులో పలు సమస్యల పై చర్చించి పారిశుద్ధ్య, నీటి సమస్య, దోమల బెడద,నూతన మోరీల ఏర్పాటు విషయం,CC రోడ్డు ల నిర్మాణం, విధి లైట్ల ఏర్పాటు, కోతులను నివారించ డానికి చేసే విధానం పై వార్డు ప్రజల కు వివరించడం జరిగింది. అదే విధంగా పెండింగ్ పైల్స్ విషయం, ఇందిరమ్మ ఇండ్లు, రోడ్డు భద్రత కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలియజేస్తూ రాష్ర్ట ముఖ్యమంత్రి చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని MLA మందుల సమేల్ సహకారం తో ఈ రోజు 11 వ వార్డులో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ సతీష్ మేనేజర్ ప్రభాకర్ వార్డు ఆఫీసర్ సంధ్య జూనియర్ అసిస్టెంట్ యాదయ్య నరేందర్, RP ధనలక్ష్మి వాటర్ లైన్మెన్ నాగరాజు, సంఘ బంధం మరియు ఆశ వర్కర్ అన్ని అనుబంధ సంఘాల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రజలతో కలసి చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య అక్కడికి విచ్చేసిన వార్డు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి.తదుపరి 11 వార్డు ఆఫీసు ను ప్రారంభించి వార్డ్ ఆఫీసర్ సంధ్యా బాధ్యతలు ఇవ్వడం జరిగింది అనంతరం,ర్యాలీ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడాం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *