ప్రజాస్వామ్య పాలనకు ప్రతిబింబంగా ‘ప్రజాదర్బారు’ కార్యక్రమం

★పెనుగంచిప్రోలు మండలంలో 112 అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 13పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున ప్రజాదర్బారు” కార్యక్రమం పెనుగంచి ప్రోలు మండల పరిషత్‌లో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక “ప్రజాదర్బారు” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 112 మంది ప్రజలు తమ అర్జీలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. వచ్చిన సమస్యలను అధికారులకు తెలియజేసి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.ప్రజలు సమర్పించిన అర్జీలలో ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి అవకాశాలు, పెన్షన్లు, దివ్యాంగుల సర్టిఫికెట్లు, వివిధ సేవల వంటి అంశాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి.అనంతరం మండల పరిషత్ కార్యాలయం ప్రాగణంలో స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రిబ్బన్ కటింగ్ చేసి ప్రదర్శన.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్‌రెసల్ సిస్టమ్ (పిజీఆర్ఎస్) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి బాధ్యతాయుతంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.