ప్రజల నాయకుడు ఖానాపూర్ ఎమ్మెల్యే

*ఉదయం సమస్య అంటూ వచ్చిన గ్రామస్తులు :

సాక్షి డిజిటల్ న్యూస్ సాయంత్రానికి గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ : ,నిర్మల్ జిల్లా ప్రతినిది ( జునైద్ ఖురేషి ) మార్చి 14 : జన్నారం మండలం మాల్యాల్ గ్రామస్తులకు అండగా నిర్మల్ డిసిసి అధ్యక్షులు,ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ , గురువారం ఉదయం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి గ్రామస్తులు తమ సమస్య తెలిపేందుకు వచ్చారు , వారి సమస్య తెలుసుకొని మీరు గ్రామానికి వెళ్ళండి నేనే మీ ఉరికి వస్తా అని మాటిచ్చారు . ఇచ్చిన మాట ప్రకారం సాయంత్రానికి ఎమ్మెల్యే మాల్యల్ గ్రామానికి ద్విచక్ర వాహనం పై చేరుకొని గ్రామస్తులతో కూర్చొని వారి సమస్య తెలుసుకున్నారు . వారి గోడు విన్న వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారుల వేధింపులకు ఎవరు భయపడొద్దని , గ్రామాన్ని తరలించేది ఉంటే జన్నారం మండలం పరిధిలోనే ఎక్కడైనా స్థలాలు కేటాయించాలని, లేదంటే గ్రామాన్ని వదిలేది లేదు మీకు అండగా నేను నిలుస్త అన్నారు . ఈ సమస్య కి పరిష్కారం కొరకు అసెంబ్లీ లో కూడా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు . గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా అండగా ఉంటానని , గ్రామాల్లో నీటి సౌకర్యం, పాఠశాల , అంగన్వాడీ ఎలాంటి సమస్యలు ఉన్న త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామస్తులు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *