పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి. ఎమ్మెల్యే గౌతు శిరీష.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 14 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజక వర్గంలోని ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు పలాస శాసనసభ్యులు గౌతు శిరీష ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థికంగా నలిగిపోయిన కుటుంబాలకు ఒక వరం లాంటిదని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం పలాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, నియోజకవర్గంలోని ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ. 4,24,200.00/- విలువైన చెక్కులను ఆమె స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం నా ప్రథమ కర్తవ్యం అని ,ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్క అర్హుడికి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నా నని,. ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మానవతా దృక్పథంతో మనం అందించే భరోసా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందింది. వీరిలో మద్దిలి తిరుపతిరావు రూ. 2,56,000/-, డొక్కరి మోహిని రూ. 42,000/-, తమ్మినాన వైకుంఠరావు రూ. 45,000/-, గార వరలక్ష్మి రూ. 20,000/-, సాహుకారి కృష్ణకుమారి రూ. 31,200/-, కారి హాసిని రూ. 30,000/- చొప్పున చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వం నుండి సకాలంలో అందిన ఈ సహాయానికి లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డులు, పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులు, మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.