పెద్ద హరివనం గ్రామం జడ్పీ హైస్కూల్ లో సరస్వతి పూజ కార్యక్రమం

★పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు మార్చి 14 ఆదోని రూరల్ రిపోర్టర్.కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివానం గ్రామంలో ఈరోజు సరస్వతీ పూజ కార్యక్రమానికి విద్యార్థులు ఉపాధ్యాయులు పిలుపుమేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప విద్యార్థి గురించి మాట్లాడుతూ అలాగే విద్య వ్యవస్థ గురించి మాట్లాడుతూ విద్యార్థులకు 10వ తరగతి పరీక్ష కి ప్రోత్సహిస్తూ అలాగే కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థను స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకు ఏ కొరత లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుంది విద్యార్థులకు స్కూల్ డ్రెస్ గాని బుక్స్ గాని మధ్యాహ్నం భోజనం గానీ విద్యార్థులకు విద్యా సంస్థకు ఎల్లప్పుడు తోడుండి ముందు నడిపిస్తున్నాడు విద్యార్థుల మీరు ఒకటే చేయాలో చదువు కోవాలి అంతే ఈరోజు పెద్ద హరివానంలో 6 తరగతి నుంచి 10 తరగతి వరకు 1100 పైన విద్యార్థులు చదువుతున్నారంటే పెద్ద హరివణనికి గర్వకరణం ఈరోజు ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కల పిల్లలు బాగా చదువుకోవాలని తపన పడుతున్నారు అలాగే శిక్షకులు కూడా తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు అందుకే విద్యార్థులు మీరు బాగా చదివి ఫస్ట్ ర్యాంకులు పాత పైన విద్యార్థి సంఘానికి పోవాలని సూచించారు ముందు రోజుల్లో పెద్ద హరివారానికి ఇంటర్ కాలేజ్ తోపాటు డిగ్రీ కాలేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తారని తెలిపినారు.