సాక్షి డిజిటల్ న్యూస్, వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కళాశాల (స్వయంప్రతిపత్తి), హనుమకొండ లో వాణిజ్య మరియు వ్యాపార పరిపాలన విభాగం ఆధ్వర్యంలో “అడ్వాన్స్డ్ రీసెర్చ్ అప్రోచెస్ ఇన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ 2047” కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్ట్ నెంట్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ చేతన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ యువ పరిశోధకులు డేటా ఆధారిత నిర్ణయ విధానాలను అభ్యసించాలని,
స్థానిక వనరులను గ్లోబల్ మార్కెట్‌కు అనుసంధానం చేయడం ద్వారా స్వావలంబన సాధ్యమని,సుస్థిర అభివృద్ధి మరియు నైతిక వ్యాపార విధానాలు భవిష్యత్తుకు అవసరమని అన్నారు. ఈ జాతీయ కార్యశాల పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తుందని అభినందించారు.గౌరవ అతిథి గా శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్ హెచ్ ఓ డి, బి ఓ ఎస్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ డి. హరికాంత్ మాట్లాడుతూ వికసిత భారత్ 2047 సాధనలో జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలు మరియు సహకారం నాలుగు ప్రధాన స్తంభాలని అన్నారు. అతిథి గా విచ్చేసిన మౌలాన అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ, హైదరాబాద్ ప్రొఫెసర్ రజా మాట్లాడుతూ ఈ జాతీయ కార్యశాల పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తుందని అభినందించారు.కళాశాల ప్రిన్సిపాల్ లిఫ్ట్ నెంట్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి మాట్లాడుతూ కామర్స్,బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగాలు నిర్వహించిన రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్ షాప్ అందరికీ ఎంతో ఉపయోగ పడిందని అన్నారు.వర్క్ షాప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.జి.రాజు రెండు రోజుల జాతీయ స్థాయి కార్యాశాల విశేషాలను తెలియజేస్తూ వర్క్ షాప్ రిపోర్ట్ అందించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన ఐ ఎ ఎస్ కు, కళాశాల విద్య ఉన్నతాధికారులకు, రూసా అధికారులకు,కళాశాల ప్రిన్సిపాల్ కి,కళాశాల సిబ్బందికి,పాత్రికేయులకు, విద్యార్థులకు,ఇతరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామనీ అన్నారు. తదనంతరం అతిథులను శాలువా, పుష్పగుచ్ఛం, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. వివిధ కళాశాలల విద్యార్థులు, ఉపన్యాసకులు, పరిశోధకులు, ఔత్సాహికులు, ఉపన్యాసకులు టెక్నికల్ సేష్షన్ లలో పాల్గొని పత్రసమర్పణ చేయగా వారందరికీ అతిథుల చేతులమీదుగా సర్టిఫికెట్ లు అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.జి.సుహాసిని, ఐ క్యూ ఏ సి కో ఆర్డినేటర్ డా.డి. సురేష్ బాబు, అకడమిక్ కో ఆర్డినేటర్ డా.ఎం.అరుణ, కామర్స్ విభాగ అధిపతి డా. ఎ.సారంగపాణి, అధ్యాపకులు డా.సుమలత, డా . పి.సురేష్ వివిధ విభాగాల అధిపతులు, భోధన బోధనేతర సిబ్బంది,ఇతర కళాశాలల అధ్యాపకులు,పరిశోధకులు, వాణిజ్యరంగ విశ్లేషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.