పరిరక్షణ కమీషన్ సభ్యునిగా నియామకం పట్ల హర్షం

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 13, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి (* గంగాడ గౌరీ శంకర్ *) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధిలోని శారది గ్రామానికి చెందిన చల్ల మధుసూదన రావు ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆంధ్ర యూనివర్సిటీ బాజీ పాలకమండలి సభ్యుడు మరియు ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్ ఎర్రపాత్రుని వెంకట నాయుడు శుక్రవారం నాడు వర్షం వ్యక్తం చేశారు. చల్ల మధు సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం ఈయన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మనబడి మాస పత్రికకు వర్కింగ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీకాకుళం ఆంధ్రజ్యోతి అర్బన్ రిపోర్టర్ గా తన కెరీర్ ప్రారంభించి ఆంధ్రజ్యోతి సాక్షి దినపత్రికలకు ఎడిషన్ ఇన్చార్జిగా పనిచేశారు. టీవీ9 లో సపరేటర్ గా ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వహించారు ఈయన కథలు కవితలు వ్యాసాలు రాయటంతో పాటు రక్తదాన శిబిరాలు సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘ సేవకులుగా మంచి గుర్తింపు పొందారు. ఆయన అందించిన సేవలకు సముచిత స్థానం దక్కిందని వెంకట నాయుడు అన్నారు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు.