పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్/ మార్చి 14 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్. అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్లరామారం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 11 మంది విద్యార్థులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు మెట్టు భాస్కర్ రెడ్డి, సర్పంచ్ మందుల రేణుక కిరణ్, ఉపసర్పంచ్ తోట కృష్ణారెడ్డి, నాయకులు తోట భాస్కర్ రెడ్డి, కోడల బయ్యలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *