సాక్షి డిజిటల్ న్యూస్ మర్చి 14 భూమయ్య పిట్లం పట్లం మండల కేంద్రంలోని నేటి నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కొరకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మండల విద్యాధికారి దేవి సింగ్ అన్నారు. మండలంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల A సెంటర్లో 179 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల B సెంటర్లో 158 మంది విద్యార్థులు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం సెంటర్లో 191 మంది విద్యార్థులు, మొత్తంగా 528 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని పరీక్షల నిర్వహణకు 29 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని, పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని, విద్యార్థులు అందరూ ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించడం జరిగింది. అనంతరం ఇన్విజిలేటర్లకు మూడు సెంటర్ల చీఫ్ సూపర్డెంట్లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు సూచనలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మూడు సెంటర్ల చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు , ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమణ రావు , శ్రీనివాస్ సూరి, శ్రీలత ,అనురాధ ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.
