పచ్చదనం ప్రగతి ప్రణాళిక లో భాగంగా చిన్న మాసన్ పల్లి గ్రామం

★ప్రగతి ప్రణాళికలో ముందుంటాం ★సర్పంచ్ రేకుల నరసింహారెడ్డి ★మురికి కాలువల నియంత్రణ,గ్రామంలో కొత్త సి. సి రోడ్ల నిర్మాణం,త్వరలో అండర్ గ్రౌండ్ డ్రై కెనాల్ లను నిర్మిస్తాం

రాయపోల్ మండలం సాక్షి రిపోర్టర్ : సొక్కం స్వామి,14/03/2026. రాయపోల్ మండలం చిన్న మాసన్ పల్లి గ్రామంలో రోడ్డుకిరువైపుల ఉన్నటువంటి గడ్డి మరియు కలుపు మొక్కలకు గడ్డి మందులు మరియు రాత్రుల్లో దోమల మందులు స్ప్రే చేయడం జరిగింది ,ఈ సందర్భంగా సర్పంచ్ రేకుల నరసింహారెడ్డి మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత అంశంగా శుక్రవారం రోజు ఫ్రై డే డ్రై డే గా గ్రామంలో పరిసరాలను పరిశీలించి మురికి కాలువలు తీపించడం జరిగింది అలాగే ప్రజలు కూడా ఎవరు వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేదంటే అధిక మొత్తంలో దోమల బెడదతో అనారోగ్యం పాలవడం తద్వారా జ్వరం మలేరియా, డెంగ్యూ,చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడి నష్టపోవడం జరుగుతుందన్నారు. అలాగే రాత్రి సమయంలో ఉష్ణోగ్రతల దృష్ట్య ఆరు బయట పడుకోవద్దని చిన్న పిల్లలకు కాళ్లు, చేతులకు నిండు దుస్తులు ధరించేలా చూసుకోవాలని దోమ తెరలను వాడడం శ్రేష్టమని సూచించారు,గ్రామంలో కూడా అతి త్వరలో ఇప్పుడున్నటువంటి ఓపెన్ డ్రై కెనాల్ లను అండర్ గ్రౌండ్ గా మార్చే దిశగా ముందుకు సాగుతామని, ఇప్పటికే చిన్న చిన్న దారులను కూడా సి. సి లు గా క్రమబద్ధీకరించామని ఆయన పేర్కొన్నారు.