సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 పెనగలూరు రిపోర్టర్ మధు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం మండలంలో నేడు 13.12.2025వ తేదీన ( రెండోవ శనివారం ) 220 కేవీ బ్రాహ్మణపల్లి సబ్స్టేషన్ లో బస్ బార్ మార్పు చేయుచున్నాము (మరమత్తులు కారణం గా) రాజంపేట టౌన్, రాజంపేట, నందలూరు, పెనగలూరు చిట్వేల్ మరియు ఓబులవారీ పల్లి మండలాలలోనీ అన్ని 33 కే వి సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉదయం 08 గంటల నుండి సాయంత్రం 05 గంటలవరకు విద్యుత్ సరఫరా ఉండదు కావున విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంస్థకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదే విధం గా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు శనివారం ఉదయం 02.00 గంటల నుంచి 08.00 గంటల వరకు త్రీఫేస్ సప్లై ఇవ్వబడును మరియు గృహ వినియోగ దారులు కూడా తాగునీటికి ఇంటి అవసరాల కొరకు నీటిని నింపుకోవాల్సిందిగా రాజంపేట ఆపరేషన్ ఏ పి ఎస్ పి డి సి ఎల్ ఈ ఈ ఎస్ రాజశేఖర్ రెడ్డి తెలపడం అయినది.