సాక్షి డిజిటల్ న్యూస్ రీపోటర్ (చిక్కెల నరేష్ )నందిపేట్ మండల కేంద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే కొత్త బస్సు సర్వీస్‌ను నందిపేట్ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ఈరోజు ప్రారంభించారు. ఈ బస్సు సర్వీస్ ప్రారంభం కావడంతో నందిపేట్ మరియు పరిసర గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, వైద్యం వంటి అవసరాల కోసం తరచుగా హైదరాబాద్‌కు వెళ్లే ప్రజలకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.