దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో పశువులకు ఎఫ్‌ఎమ్‌డీ టీకాలు

"వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి"

పయనించే సూర్యుడు మార్చి 13 రాజేష్ : దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో పశువులకు ఎఫ్‌ఎమ్‌డీ (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) వ్యాక్సిన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మధ్యలో స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థిక స్థితికి ఎంతో కీలకమని ఆయన తెలిపారు. ఫుట్ అండ్ మౌత్ వ్యాధి పశువులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన వ్యాధి కావడంతో రైతులు తప్పనిసరిగా తమ పశువులకు టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పశువుల వైద్యులు డాక్టర్ సుదర్శన్, డాక్టర్ వెంకటయ్య తమ సిబ్బందితో కలిసి పశువులకు టీకాలు వేశారు. గ్రామ వార్డ్ సభ్యులు శిల్ప, దుర్గని నరసింహులు, మంత్రి కరుణాకర్, దుర్గని మధుసూదన్, నల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.అలాగే గ్రామానికి చెందిన రైతులు సూరంపల్లి శ్రీనివాస్ సహా పలువురు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పశువులకు టీకాలు వేయించుకున్నారు. పశువుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.