దేశ ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత గండిపల్లి రాజు…

★అంబేద్కర్ ఆశయాలే దేశానికి మార్గదర్శకం –అంబేద్కర్ చూపిన మార్గమే దేశ ప్రగతికి దారి – గండిపల్లి రాజు.

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14, 2026. మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ భారత రాజ్యాంగ శిల్పి, మహానీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ 12వ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు గండిపల్లి రాజు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన సందేశం నేటికీ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.దేశంలో ప్రతి పౌరుడు సమాన హక్కులు పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు అంబేద్కర్, ఆయన ఆశయాలు యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయని గండిపల్లి రాజు పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వం, న్యాయం, అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు బోడుప్పల్ సర్కిల్ 12వ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు గండిపల్లి రాజు.